తన తల్లి తనను శారీరకంగా, మానసికంగా వేధించేదని.. ఇంటికి వచ్చిన వారితో సన్నిహితంగా ఉండమని, తనకు హార్మోన్ టాబ్లెట్లు ఇచ్చి శరీరం పెరిగేలా చేసిందని.. తనను చదువుకోనివ్వకుండా టార్చర్ చేసేదని.. పదహారేళ్ల బాలిక చైల్డ్ లైన్‌కు, దిశా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ ఫిర్యాదులో వాస్తవం లేదని ఆమె తల్లి ఆనంద కుమారి అంటోంది. ఈ వ్యవహారంలో మీడియా ముందుకు వచ్చిన ఆనంద కుమారి సంచలన విషయాలు వెల్లడించింది.
'ఒక ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో జరుగుతున్న గొడవల నేపథ్యంలోనే.. ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు నా కూతుర్ని ట్రాప్ చేసి వాడుకోవాలని చూశారు. వాళ్లే నా కూతురుని హిప్నటైజ్ చేసి.. పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేసేలా చేశారు. వారే బాగు చేస్తున్నట్టుగా నటించారు. నా ఆస్తులను కొట్టేయాలని చూస్తున్న అభిషేక్, దేవరాజ్ అనే ఇద్దరు వ్యక్తులే ఈ పని చేశారు. నన్ను వేధించి.. నా కూతురుని ట్రాప్ చేయాలని చూస్తున్నారు. అభిషేక్, దేవరాజుతో ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై మాట్లాడేందుకు నా ఇంటికి వచ్చినప్పుడు పాపను ట్రాప్ చేశారు' అని ఆనందకుమారి ఆరోపిస్తోంది.
'వారు ట్రాప్ చేస్తున్న విషయాన్ని నేను గ్రహించి.. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశా. అలా ఫిర్యాదు చేసిన రాత్రే.. తన కూతురికి మాయమాటలు చెప్పి.. నాకు వ్యతిరేకంగా చైల్డ్ లైన్‌కు ఫిర్యాదు చేయించారు. నా కూతుర్ని ఫిజికల్‌గా వేధిస్తున్న సమయంలో.. నేను అడ్డుకోవటాని ప్రయత్నించా. వారు చేస్తున్నదంతా.. వీడియో తీశాననే చైల్డ్ లైన్‌లో నాపై నా కూతురితో ఫిర్యాదు చేయించారు. ఆ ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకొని.. నా కూతురును నాకు అప్పగించాలి' అని తల్లి ఆనంద కుమారి కోరుతోంది.