ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాటికి కాలుచాపిన వాళ్లకే స్మశానం గుర్తొస్తుంది,,,చంద్రబాబు నాయుడుపై వల్లభనేని వంశీ ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 11, 2023, 07:26 PM

గన్నవరంలోని పానకాల చెరువును రిజర్వాయర్‌గా చేసే పనులకు.. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శంకుస్థాపన చేశారు. పానకాల చెరువు రిజర్వాయర్‌గా మారితే.. గన్నవరం ప్రజలకు మంచినీటి సమస్య తీరుతుందని వివరించారు. చెరువులో పూడిక తీసిన మట్టిని గన్నవరం నియోజకవర్గంలోని జగనన్న లేఔట్‌లకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై వల్లభనేని వంశీ  ఘాటు విమర్శలు చేశారు.


'కాటికి కాలు చాపిన వాడికి స్మశానం గుర్తుకొస్తుంది. చంద్రబాబు కాటికి కాలు చాపాడు కాబట్టే.. పేదలకు ఇస్తున్న సెంటు స్థలంను సమాధులతో పోల్చాడు. ఊరు పొమ్మంటుంది.. కాడు రమ్మంటుంది అనే స్థితిలో చంద్రబాబు ఉన్నారు. గన్నవరం నియోజకవర్గంలో 27 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే.. ఎక్కువ శాతం ఇళ్లు నిర్మించుకొని గృహ ప్రవేశం చేశారు. అద్దె ఇంట్లో ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న 30 లక్షల మంది పేదలకు.. జగన్ ఆత్మగౌరవాన్ని ఇచ్చారు' అని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు.


'పేద ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్లు పనికిమాలిన సన్నాసులు. అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు అన్నట్లు ఉంది చంద్రబాబు శైలి. గత ప్రభుత్వంలో ఒక్క సెంటు భూమి కుడా పేదలకు ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో సెంటు భూమి కుడా ఇవ్వకుండా.. ఇప్పుడు ఇచ్చే వాళ్లను విమర్శించడం ఏంటీ' అని వల్లభనేని వంశీ ప్రశ్నించారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com