బీహార్‌లోని బంగా జిల్లాలో ఓ పెళ్లి వేడుకలో భోజనం చేసిన 250 మంది అస్వస్థతకు గురయ్యారు. చందన్ బ్లాక్‌లోని కస్వావాసి పంచాయతీ చీడ గ్రామానికి చెందిన బాబర్ అన్సారీ ఇంట్లో వేడుక నిర్వహించి గ్రామస్తులంతా వెళ్లారు. తిన్న తర్వాత కొందరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. 250 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వైద్యాధికారులు వెంటనే గ్రామంలో శిబిరం ద్వారా చికిత్స అందిస్తున్నారు. ఘటనపై విచారణ జరుపుతామన్నారు.