నోయిడాలోని ఫిల్మ్ సిటీలోని ఓ స్టూడియోలో విషాదం చోటుచేసుకుంది. ఫ్యాషన్ షో సందర్భంగా లైటింగ్ ట్రస్ మోడల్‌పై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో మోడల్ గాయపడి కైలాస్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని వంశిక చోప్రా (24 ఏళ్లు)గా గుర్తించారు. ఈ మేరకు లైటింగ్ ట్రస్ ఏర్పాటు చేసిన వారితో పాటు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.