మందస మండలంలో గల మండల ప్రాథమిక పాఠశాల బైరి సారంగపురంలో సోమవారం జగనన్న విద్యా కానుకను పాఠశాల ప్రధానోపాధ్యాయులు యమ్. అప్పలచార్యులు అధ్యక్షతన పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కోడి చంద్రకళ మరియు గ్రామ పంచాయితీ సర్పంచ్ ప్రతినిధి సరస్వతిలింగరాజు చేతులు మీదుగా పంపకం చేయడమైనది. స్థానిక సర్పంచ్ మాట్లాడుతూ జగనన్న ఇచ్చినటువంటి నాణ్యమైన పుస్తకాలు, దుస్తులు, బూట్లు, షూస్, బాగ్స్ ఉపయోగించుకొని చక్కగా చదువుకొని మా గ్రామానికి ఈ పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యతులు తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ప్రభాకర్ పట్నాయక్ మాస్టర్, భైరాగి మాస్టర్, మహేశ్వర రావు మాస్టర్ మరియు పద్మావతి మేడం పాల్గొన్నారు.