పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం , కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ బాలాజీ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి దేవస్థానం కార్యనిర్వహణధికారి వెంకటేష్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను మరియు చిత్రపటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాబు, ఐరాల ఎమ్మార్వో, తదితరులు ఉన్నారు.