గంగవరం మండలం సెరికల్చర్ గ్రైనేజ్ సెంటర్ ప్రాంగణంలో ఉన్న బావిలో మహిళ మృతదేహం లభ్యమైన ఘటన సోమవారం వెలుగు చూసింది. గమనించిన సెరికల్చర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమచారం అధుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహన్ని పరిశీలించారు. మృతురాలు గాంధీ నగర్ కు చెందిన ఈశ్వర్ భార్య పుష్ప గా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల ముందు తన భార్య కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. భావిలో పుష్ప మృతదేహం బయటపడటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.