కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నులు, సుంకాల్లో.. రాష్ట్రాల వాటా కింద వచ్చే నిధులను ఆర్థిక శాఖ సోమవారం విడుదల చేసింది. పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.4 వేల 787 కోట్లు, తెలంగాణకు రూ.2 వేల 486 కోట్లు దక్కాయి. ఈ మొత్తాన్ని మూలధన వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతానికి వినియోగించాలని.. ఆర్థిక శాఖ సూచించింది. ప్రధాన ప్రాజెక్టులు, స్కీముల అమలుకు చేదోడు అందించే ఉద్దేశంతో ఈ నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేసింది.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో.. 41 శాతం వాటాను రాష్ట్రాలకు అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో 14 విడతల్లో విడుదల చేస్తోంది. ఆ విషయం అలా ఉంటే.. ఏపీకి ఇటీవల కూడా కేంద్రం భారీగా నిధులు విడుదల చేసింది. లోటు బడ్జెట్ కింద 10 వేల 400 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం 12 వేల కోట్లు విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa