ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తండ్రి మందలించాడని యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 13, 2023, 11:13 AM

కడప జిల్లా, మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీ కృష్ణాపురంలో భవన నిర్మాణ కార్మికుడు బాలకృష్ణ(20) ఆత్మహత్య చేసుకున్నాడు. కృష్ణాపు రంకు చెందిన రమణ కుమారుడు బాలకృష్ణ భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేస్తున్నాడు. అతని తల్లి అలివేలమ్మ ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, తండ్రి, అన్నతో పాటు నివశిస్తు న్నాడు. కాగా బాలకృష్ణ పనికి వెళ్లకుండా గంటల తరబడి ఫోనులో మాట్లాడుకుంటుండగా అతని తండ్రి రమణ మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన అతను సోమవారం ఉద యం ఇంటిలోని ఫ్యానుకు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుం బీకులు ఉరి నుంచి దించి మదనపల్లె జిల్లా వైద్యశాలకు తరలి స్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని మార్చురికి తరలించారు. మదనపల్లె తాలూ కా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com