కడప జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే రోడ్డు అభివృద్ధి అనే ముద్దు పేరుతో రైతులకు న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వకుండా బలవంతంగా భూములు తీసుకుంటున్నారని తక్షణమే ఆపాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి తెలిపారు. మంగళవారం మైదుకూరు తహసిల్దార్ కార్యాలయంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులతో గ్రామసభ బద్వేల్ ఆర్డివో సమక్షంలో జరిగింది.ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే కోసం సేకరిస్తున్న భూములు పులివెందల ఎర్రగుంట్ల కమలాపురం చాపాడు మైదుకూరు బి. మఠం ప్రాంతాలలో చాలా విలువైన భూములని ఎకరా కోటి రూపాయలు పైగా ఉన్నాయని రెండు మూడు పంటలు పండే భూములని అటువంటి కి ఎకరానికి 10 నుంచి 15 లక్షల మాత్రమే ఇస్తామంటున్నారని , నోటీసులు ఇవ్వకుండా గ్రామ సభలు పెట్టకుండా రైతులు వ్యతిరేకించిన కూడా భూములలో బలవంతంగా సర్వే చేస్తూ నెంబర్ రాళ్లు పాతుతున్నారని ఆయన తెలిపారు. 2023 మార్కెట్ రేటు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ ఈ నిరసన కార్యక్రమంలో మైదుకూరు రైతు సేవ సమితి అధ్యక్షులు ఏవి రమణ గారు నిరసనకు సంఘీభావం మద్దతు తెలియజేశారు రైతు సంఘం నాయకులు కొండారెడ్డి శ్రీనివాసులు రెడ్డి తో పాటు మరి కొంతమంది రైతులు రోడ్డు నిర్వాసితులు పాల్గొన్నారు