బిపర్‌జాయ్ తుపాను గురువారం తీరం దాటనున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం బిపర్‌జాయ్ తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో పోరుబందర్‌కు నైరుతివైపు 350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీర ప్రాంతాల్లోని సుమారు 30 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక చర్యల్లో పాలుపంచుకునేందుకు సైన్యాన్ని కూడా రంగంలోకి దించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa