బి కోడూరు మండలంలోని పెదుళ్ళపల్లి గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందరికీ చేరుతున్నాయా లేదా అన్న వివరాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో జగనన్న ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేయమని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి, బి కోడూరు మండల నాయకులు సోదరి రామకృష్ణారెడ్డి, వైసీపీ నాయకులు కార్యకర్తలు, సచివాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa