విజయవాడ డివిజన్లోని తాడి-అనకాపల్లి మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైలు సర్వీసులు దెబ్బతిన్నాయని వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. దీని కారణంగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అందువల్ల రైళ్లు విజయనగరం వద్ద షార్ట్ టర్మినేషన్ ఆరిజినేషన్ చేశామని వెళ్లడించారు.
13న గుంటూరు నుండి బయలుదేరే రైలు నెం 17243 గుంటూరు-రాయగడ ఎక్స్ప్రెస్ రైలు విజయనగరం వద్ద షార్ట్ టర్మినేట్ చేయబడుతుందని విజయనగరం మరియు రాయగడ మధ్య ఈ రైలు సర్వీసు ఉండదన్నారు. అదే విధంగా రైలు నెం 17244 రాయగడ నుండి గుంటూరు ఎక్స్ప్రెస్ రాయగడకు బదులుగా 14న విజయనగరం నుండి బయలుదేరుతుందని తెలిపారు.