విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వ వార్డు మధురానగర్ జివిఎంసి హై స్కూల్ లో బుధవారం జరిగిన జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలోముఖ్యఅతిథిగా పాల్గొన్న విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె కె రాజు పలువురు విద్యార్థులకు జగనన్న విద్యా కానుకలు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి విద్యార్థిని విద్యార్దులను తన సొంత కుటుంబ సభ్యుల్లా భావించి వారికి నాణ్యమైన విద్యను అందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి వై. యస్ జగన్మోహన్ రెడ్డి వారికి అనేక రకాలుగా తోడ్పాటును అందిస్తున్నారని అన్నారు.
ఈఅవకాశాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకొని ఉన్నత విద్యను అభ్యసించి చదువుకున్న స్కూల్ కి తల్లిదండ్రుల కి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో 25 వార్డు కార్పొరేటర్, స్టాండింగ్ కమిటీ మెంబర్ సారిపిల్లి గోవింద్ హై స్కూల్ హెడ్ మాస్టర్ శాంతి కుమారి, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ బి. దేముడు బాబు, బోగవల్లి గోవింద్, హరి, స్కూల్ టీచర్స్, స్కూల్ కమిటీ, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.