విద్యుత్తు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ 18న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించాలని పది వామపక్ష పార్టీలు కలిసి ఉమ్మడిగా నిర్ణయించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. స్ట్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని ఎంపీలందరికీ వినతిపత్రాలు సమర్పించడంతోపాటు వామపక్షాల ఆధ్వర్యంలో ప్రతినిధి వర్గం ఢిల్లీకి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. వి.శ్రీనివాసరావు, వై.వెంకటేశ్వరరావు (సీపీఎం), కె.రామకృష్ణ, జల్లి విల్సన్ (సీపీఐ), పి.ప్రసాద్, పోలారి (సీపీఐ-ఎంఎల్ న్యూడెమొక్రసీ), ఎన్.మూర్తి, రాందేవ్ (సీపీఐ - ఎంఎల్ లిబరేషన్), కాటం నాగభూషణం, ఖాదర్‌బాషా(ఎంసీపీఐ-యు), జాస్తి కిశోర్‌బాబు (సీపీఐ-ఎంల్), రామకృష్ణ(సీపీఐ-ఎంఎల్ న్యూడెమొక్రసీ), సుధీర్ (ఎస్‌యూసీఐ-సి) తదితర నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.