కడప నగంలోని అక్కాయపల్లె ప్రాంతంలో 3.68 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వైఎస్ అవినా్‌షరెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మేయరు సురేష్ బాబు, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, కమిషనర్ ప్రవీణ్‌చంద్, స్థానిక కార్పొరేటరు పాకా సురేష్ హాజరయ్యారు. హిందూ స్మశాన వాటిక పబ్లిక్ టాయిలెట్స్ ఓవర్‌హెడ్ ట్యాంకులను ప్రారంభించగా పార్కు నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటరు పాకా సురేష్ మాట్లాడుతూ 47వ డివిజనులో రూ.15 లక్షలతో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టామన్నారు. అలాగే రూ.2.34 కోట్లతో ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మించినట్లు తెలిపారు. హిందూ మోడరన్ శ్మశాన వాటికను రూ.49 లక్షలతో నిర్మించామన్నారు. అలాగే పార్కు నిర్మాణానికి సంబంధించి రూ.70 లక్షల వ్యయంతో నిర్మాణ పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్పోరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు.