రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా రష్యా దళాలు బుధవారం తెల్లవారుజామున డోనస్కీ నగరంపై అటాక్ చేశాయి. ఆ దాడిలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడినట్లు ఉక్రెయిన్ సైన్యాధికారులు వెల్లడించారు. డోనస్కీని టార్గెట్ చేస్తూ రష్యా ఆరు కేహెచ్-22 క్రూయిజ్ మిస్సైళ్లను వదిలినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. అలాగే ఒడిసా పట్టణంపై కూడా రష్యా దాడులు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa