జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకంలో రీసర్వే ముగిసిన గ్రామాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసి సంబంధిత లబ్దిదారులకు హక్కు పత్రాలను పంపిణీ చేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. నరసరావుపేట పట్టణంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రీసర్వే లబ్ధిదారులకు కొనసాగిస్తున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను జేసీ గురువారం పరిశీలించారు. భూ హక్కు పత్రాల పంపిణీలో జాప్యం లేకుండా చూడాలని చెప్పారు.