రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వ్యవహరించి విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టిన పథకాలు వల్ల విద్యార్థుల భవిష్యత్తు ఆశాజనకంగా ఉందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కొనియాడారు. గురువారం నర్సీపట్నం నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను ఎమ్మెల్యే గణేష్ అందజేశారు. ఆర్డిఓజయరాం పాల్గొన్నారు.