ప్రభుత్వం నిర్వహిస్తున్న గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ శుక్రవారం ఉదయం తెల్ల వారుతుండగానే చోడవరం నియోజకవర్గ పరిధిలోగల బుచ్చయ్యపేట మండలం ఈ భీమవరం గడపలో అడుగుపెట్టి ప్రజలను తట్టి లేపారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోకి వచ్చిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరిస్తూ భవిష్యత్తులో మరల వాటిని పొందాలన్నా మరిన్ని సంక్షేమాలు అందుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. ఇంకా అర్హులైన వారు ఎవరైనా ఉంటే వారికి కూడా సంక్షేమ ఫలాలు అందిస్తామని చెప్పారు. ప్రజలకు ప్రభుత్వానికి వారదులుగా ఉంటూ ప్రజల చెంతకు సంక్షేమ ఫలాలు తీసుకెళ్తున్న వాలంటీర్లను ఆయన అభినందించారు. అలాగే గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు తగిన నిధులు మంజూరు చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా పలు సమస్యలను గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్యపేట జడ్పిటిసి దొండ రాంబాబు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు , పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.