ఈ నెల 18-21 వరకు నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 19న ఏపీలోని చిత్తూరు, అన్నమయ్య, కడప, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయి. అయితే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి వర్షాలు కురవాల్సిన తరుణంలో మరింతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శనివారం 264 మండలాలు, ఆదివారం 203 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.