దేశంలో క్రైం రేటును తగ్గించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, కొంతమంది దుండగులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఇలాంటి ఘటన యూపీలోని బులంద్‌షహర్ లో జరిగింది. అర్నియా మౌజ్‌పూర్ గ్రామంలో డజను మంది రౌడీలు ఓ కుటుంబంపై తీవ్రంగా దాడి చేశారు. కుటుంబంలో గర్భిణీ ఉండగా, ఆమెపై సైతం దాడికి పాల్పడ్డారు. దీంతో గర్భిణి సహా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.