ఉగాండాలోని ఓ పాఠశాలపై తిరుగుబాటుదారులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో 25 మంది మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా, ఈ పాఠశాల కాంగో సరిహద్దుకు కేవలం 2 కి.మీ దూరంలోనే ఉంది. మృతులు విద్యార్థులా లేదా సాధారణ పౌరులా అనేది ఇంకా తెలియలేదు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.