ప్రజల ముంగిటకే ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య అన్నారు. శనివారం గజపతినగరం మండలంలోని కొత్తబగ్గాం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, ఆరోగ్య కేంద్రాల భవనాలను ఎమ్మెల్యే అప్పలనరసయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందించేందుకు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ బెల్లాన జ్ఞాన దీపిక, జడ్పిటిసి గార తవుడు, ఏఎంసి చైర్మన్ వేమలి ముత్యాలనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్ పల్లి సంజీవరావు, మండల పార్టీ అధ్యక్షుడు బూడి వెంకటరావు, వైకాపా నాయకులు బెల్లాన త్రినాధరావు, వైద్యాధికారి డాక్టర్ సాయికృష్ణారెడ్డి, ఎంపీడీవో కొవ్వాడ కిషోర్ కుమార్, తహసిల్దార్ మరడాన అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు.