పన్నుల చెల్లింపు, రిజిస్ట్రేషన్, ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆడిట్ తదితర ప్రక్రియలను ఇకనుంచి వేర్వేరుగా నిర్వహిస్తామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. జీఎస్టీ విజయవాడ ప్రాంతీయ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బుగ్గన మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ జీఎస్టీ వసూళ్ల కంటే రాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని చెప్పారు. 2022-23 సంవత్సరంలో రూ.28,103 కోట్ల పన్నులు వసూలు చేయడం రాష్ట్ర చరిత్రలోనే అధికమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపక్షాలకు బుగ్గన సవాల్ విసిరారు.