రాష్ట్రంలో కెమికల్స్ అండ్ పెట్రో కెమికల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర రసాయన, పెట్రోకెమికల్స్ శాఖ కార్యదర్శి అరుణ్ బరోకతో కూడిన అధికారుల బృందం శుక్రవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డితో భేటీ అయింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో 640 చదరపు కిలోమీటర్లతో కూడిన పెట్రోలియం, కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ ఇన్వెస్టిమెంట్ రీజియన్(పీసీపీఐఆర్)ను కలిగి దేశంలో నాలుగో రాష్ట్రంగా ఉందని, పెట్టుబడిదారులకు అవాంతరాలు లేని వ్యాపార వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని చెప్పారు.