హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షపు నీటి వల్ల వరదలు పోటెత్తున్నాయి. ఆదివారం కురిసిన వర్షానికి కరేరి నది వద్ద 26 మంది పర్యాటకులు చిక్కుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్ఆర్డీఎఫ్ బలగాలు, మెక్లియోడ్గంజ్ పోలీసులు రెస్క్యూ సంయుక్తాధ్వర్యంలో ఆపరేషన్ నిర్వహించి 26 మంది పర్యాటకులను సురక్షితంగా కాపాడారు. ఈ విషయాన్ని సోమవారం ఎస్పీ శాలిని అగ్నిహోత్రి తెలిపారు.