అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భావిభారత ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ అల్లాబాకష్ ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా రాయచోటి పట్టణం నడిబొడ్డున బంగ్లా దగ్గర కేక్ కోసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లాబాకష్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాని మంత్రిని చేయాలని యువత రాజకీయాల్లోకి రావాలని రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు యువత రాజకీయాల్లోకి రావాలని యువతరానికి స్ఫూర్తిని నింపి దేశ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.