విద్యార్థులు భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి విద్యార్థులు చదువుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మండల ఎంపీపీ మొదలవలస చిరంజీవి అన్నారు. ఎచ్చెర్ల మండలం కొత్తపేట జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన జగనన్న ఆణిముత్యాలను సోమవారం ఎంపీపీ చేతుల మీదుగా సత్కరించారు. అనంతరం నగదు బహుమతి విద్యార్థులకు అందజేశారు.