ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సైబర్ లాక్కి గురైన మహేశ్ బ్యాంక్ కేసులో సూచనలను పాటించనందుకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో అడ్మినిస్ట్రేటివ్ అధికారిని నియమించాలని ఆర్బీఐకి ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడంతో మహేష్ బ్యాంక్ వాటాదారులు కోర్టుకు వెళ్లారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ఆర్బీఐ గవర్నర్‌కు నోటీసులు జారీ చేసింది.