పేరేచర్లలోని నికో ఆగ్రో కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని, మంచినీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని కోరుతూ సమ్మె నోటీసు ఇచ్చిన కార్మికులపై తక్షణమే వేధింపులు ఆపాలని కోరుతూ మంగళవారం పేరేచర్ల సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు. యూనియన్ గౌరవాధ్యక్షులు బి లక్ష్మణరావు మాట్లాడుతూ. సమస్యలు పరిష్కరించమని అడిగితే వేధింపులకు గురి చేయటం అన్యాయమని అన్నారు.