ఉత్తరప్రదేశ్‌లోని బలియా ఆస్పత్రిలో మిస్టరీ మరణాలు నమోదవుతున్నాయి. సోమవారం నాటికి మరో 11 మంది ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 68కి చేరింది. అయితే ఇవి వడదెబ్బ మరణాలేనని అంటున్నా.. వైద్యులు మాత్రం పలు కారణాలు చెబుతున్నారు. 60 ఏళ్లు పైబడిన వారే మరణిస్తున్నారని, వారికి ఇతర వ్యాధులు కూడా ఉన్నట్లు వైద్యులు అంటున్నారు. గడిచిన 24 గంటల్లో 178 మంది రోగులు ఆస్పత్రిలో చేరారని, వీరిలో 11 మంది మరణించినట్లు వైద్యులు వెల్లడించారు.