యువతిని బెదిరించి ఐదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న చర్చి ఫాదర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కడంపూర్కు చెందిన ఓ యువతి (20) 2018లో పాటలు నేర్చుకోవడానికి చర్చికి వెళ్లింది. అక్కడ ఫాదర్గా ఉన్న వినోద్ జోస్వర్ (40) ఆమెను బెదిరించి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. వేధింపులు పెరగడంతో యువతి కడంబూర్ మహిళా పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వినోద్ జోస్వర్ను అరెస్ట్ చేశారు.