ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిడ్నాప్ ఎపిసోడ్ సీబీఐతో విచారణ జరిపించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 21, 2023, 05:28 PM

పోలీసులు చెప్పేవరకు తమ కుటుంబ సభ్యులు కిడ్నాప్ అయినట్లు తెలియదని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ చెప్పారు. ఈ వ్యవహారంపై బుదవారం విశాఖలో ఎంపీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 12న తెల్లవారు జామున గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. కిడ్నాపర్లు మా కుటుంబ సభ్యుల ను క్రూరంగా హింసించి డబ్బులు వసూలు చేశారు. మూడు రోజులు రెక్కీ నిర్వహించి కిడ్నాప్ చేశారు. హేమంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఏ2 రాజేశ్పై 40కిపైగా కేసులు ఉన్నాయి. హేమంతో నాకు ఎలాంటి సంబం ధం లేదు. విశాఖలో రక్షణ లేదని కొందరు అనటం సరికాదు. కిడ్నాప్ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును పోలీసులు ఛేదించారు. 


చిన్న చిన్న ఘటనలు ఎక్కడైనా జరగటం సహజం అని ఎంవీవీ వ్యాఖ్యానిం చారు. ఈ కిడ్నాప్ ఎపిసోడ్ పై సీబీఐ విచారణ జరిపించాలని  డిమాండ్ చేశారు. దీనివల్ల  కిడ్నాపర్లు ఇంట్లో ప్రవేశించిన నాటి నుండి బయటకు వెళ్ళే వరకూ అన్ని బయటికి వస్తాయని ఎర్ర గంగిరెడ్డితో తనకు లావా దేవీలు వున్నాయనడం అనడం బాధాకరమని అన్నారు. వెయ్యి కోట్లు రూపాయలు లావా దేవీలు జరిగాయి అంటున్నారు. నా ఆస్తి మొత్తం వెయ్యి కోట్ల రూపాయలు వుండదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారి నెంబర్ లు అడిగారని గంజాయి తాగు తూ చాలా దారుణం గా ప్రవర్తించారన్నారు. ఈ కిడ్నాప్ వెనుక మరే ఇతర కోణం వుందా అని మీడియాలో కధనాలు రావడం బాధగా ఉందని హేమంత్, రాజేష్ ఇద్దరూ కూడా రౌడీ షీటర్లు, జైలులో ప్లాన్ వేసుకున్న ప్రకారం ఈ కిడ్నాప్ జరిగిందని చెప్పారు. 


గడిచిన అయిదు సంవత్సరాల కాలంలో నా ఫోన్ కాల్స్ రికార్డు తీయండి. హేమంత్ తో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. విశాఖపట్నం లో రక్షణ లేదు అనడం కరెక్ట్ కాదు. ఇక్కడ అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని పేర్కొన్నారు. పోలీసులు కిడ్నాప్ ఘటన జరిగిన రెండు గంటలు లో ట్రేస్ అవుట్ చేశారని, నేరాలు, మత ఘర్షణలు వంటివి అన్నీ ప్రభుత్వాల హయాంలో  జరుగుతూనే ఉంటాయన్నారు. బిజినెస్ విషయం లో నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతాను. కారణం మీడియా గతంలో ఎస్పీ తో ఒక ల్యాండ్ విషయం గొడవ సమయంలోనే చెప్పానన్నారు. నా పై ఒక్క కన్జూమర్ కేసు కూడా లేదని, వ్యాపారం విషయంలో  ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్న మనస్తాపంతో మాత్రమే ప్రభుత్వంకి చెడ్డ పేరు రాకూడదు అనే ఉద్దేశ్యంతో మాత్రమే హైదరాబాద్ కి షిఫ్టింగ్ అవుతానన్నారు . ప్రశాంతంగా వుండే విశాఖలో ఇలాంటివి జరగడం బాధాకరమన్నారు. విశాఖ అభివృద్ధి లో కానీ, వైసీపీ ప్రభుత్వం సుపరి పాలన విషయం లో కానీ ఎంపీ వలన చెడ్డ పేరు వస్తుంది అని ఎవరూ అనకూడదు అనే ఉద్దేశ్యంతో మాత్రమే నా అభిమతమని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa