అమెరికాలోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయ ప్రాంగణంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. యోగా కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో జాతీయులు పాల్గొన్న ఈవెంట్‌గా ఈ ఈవెంట్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను ప్రధాని మోదీ అందుకున్నారు.