మణిపూర్లో కొనసాగుతోన్న హింసాకాండపై కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోవడం, వేలాది మంది నిరాశ్రయులు కావడం చాలా బాధాకరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు సహనం వహించాలని, హింసకు స్వస్తి పలికి శాంతిని నెలకోల్పాలన్నారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా, మణిపూర్ హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు 100 మందికిపైగా మరణించినట్లు సమాచారం.