ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కోర్టు తీర్పుపై అసంతృప్తి.. జడ్జి కారు అద్దాలు పగులగొట్టాడు

national |  Suryaa Desk  | Published : Thu, Jun 22, 2023, 11:25 AM

విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి జడ్జి కారు అద్దాలను పగులగొట్టాడు. ఈ ఘటన కేరళలోని పథనంతిట్ట జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. విడాకుల కోసం నిందితుడి భార్య కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆరేళ్లుగా ఈ కేసుపై కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదని కోపోద్రిక్తుడైన వ్యక్తి కోర్టు ఆవరణలో ఉన్న జడ్జి కారు అద్దాలు పగులగొట్టాడు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని ఎఫ్ఆర్ఐ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com