ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రీడాకారులకు శుభవార్త అందించారు. ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో నిర్వహించనున్న క్రీడా వేడుకలపై గురువారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. కడప, తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలలో క్రికెట్ అకాడమీలు ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకు వచ్చిందని పేర్కొన్నారు.