18 ఏళ్ల వయసులోనే భారత్‌లో కమర్షియల్ పైలెట్ లైసెన్స్ పొంది సాక్షి కొచ్చర్ రికార్డు సృష్టించింది. మహిళా పైలెట్ మైత్రీ పటేల్ సాధించిన ఈ రికార్డును సాక్షి కొచ్చర్ తిరగరాసింది. అయితే సాక్షి, మైత్రీ ఇద్దరూ కెప్టెన్ ఏడీ మాణెక్ వద్ద శిక్షణ పొందారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని పర్వానా పట్టణానికి చెందిన సాక్షి తన లక్ష్యాన్ని ఏడున్నర నెలల్లోనే పూర్తి చేసి అతి చిన్న వయసులో కమర్షియల్ పైలెట్ లైసెన్స్‌ను పొందింది.