తీవ్ర శ్వాసకోస అనారోగ్యానికి గురైన ఓ చిన్నారి ప్రాణాలను నిలపడానికి భారత నౌకాదళం గొప్ప సాహసం చేసింది. ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా రాత్రివేళలో 500 కిలోమీటర్ల మేర విమానం నఅంతగా సౌకర్యాలు లేని రన్‌వే.. రాత్రివేళ సాహసండిపి సకాలంలో ఆ చిన్నారిని ఆస్పత్రికి చేర్చింది. వివరాల్లోకి వెళ్తే లక్షదీవుల్లోని అగత్తి దీవిలో ఓ రెండున్నరేళ్ల బాలుడు తీవ్ర అనారోగ్యం బారినపడ్డాడు. ఆస్పిరేషన్ న్యుమోనియా, శ్వాసకోశ వైఫల్యంతో పోరాడుతున్న ఆ బాలుడికి తక్షణ వైద్య సహాయం అవసరం. మారుమూల ప్రాంతం కావడంతో అక్కడ ఎటువంటి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో ఆందోళన చెందిన బాలుడి కుటుంబం.. లక్షదీవుల అధికార యంత్రాంగానికి తమ కుమారుడి పరిస్థితి వివరించింది.
దీంతో ఆ చిన్నారి ప్రాణాలు నిలవాలంటే తక్షణమే కోచికి తరలించాలని భావించింది. ఈ విషయంలో భారత నౌకాదళం సాయం కోరింది. వెంటనే రంగంలోకి దిగిన నౌకాదళం డోర్నియర్ విమానం ద్వారా ఆ చిన్నారిని కేరళలోని కొచ్చిన్‌కు తరలించింది. అప్పటికి అరేబియా సముద్రంలో ప్రతికూల వాతావరణం ఉన్నా లేక్కచేయలేదు. అగత్తి వైమానిక కేంద్రం నుంచి హుటాహుటిన విమానంలో తీసుకెళ్లి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఆపరేషన్‌పై ఇండియన్ నేవీ ఓ ప్రకటనలో తెలియజేసింది.
రాత్రివేళ విమానాల రాకపోకలకు అనుమతించే చర్యల వల్ల ఇది సాధ్యమైందని నౌకాదళం గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఆ బాలుడు ప్రస్తుతం కోచిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపింది. అగత్తిలో వైమానిక కేంద్రాన్ని 1988లో ప్రారంభించి.. డోర్నియర్-228 విమానాలను నడుపుతున్నారు. తర్వాత 2010లో ఏటీఆర్-72 యుద్ధ విమానాలను నడిపేందుకు వీలుగా దీనిని విస్తరించారు. అయితే, గతేడాది అక్టోబరులో మొదటిసారిగా డోర్నియర్-228 విమానాలను రాత్రిపూట ల్యాండింగ్ ప్రారంభించారు. దీంతో లక్షదీవుల సమీపంలో భారత నౌకాదళం 24 గంటల నిఘా సామర్ధ్యం రెట్టింపయ్యింది. అయితే, తక్కువ పొడవున్న రన్‌వే, పరిమిత ఎయిర్‌ఫీల్డ్ సేవలు అందుబాటులో ఉండటంతో పౌర, సైనిక విమానాలు రెండూ పగటిపూట మాత్రమే నడుపుతున్నారు.