గంగవరం పోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇటీవల పోర్టు కార్మికులు. పోర్టు యాజమాన్యం మధ్య దూరం పెరిగింది. అకారణంగా కార్మికులను విధుల నుంచి తొలగించడం, ఏళ్ల తరబడి పనిచేస్తున్నా వేతనాలు పెంచకపోవడం వంటి కారణాలతో కార్మికులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసింది.
ఇటీవల ఈ ఆందోళన తీవ్రతరం కావడంతో ఆర్డీవో సమక్షంలో కార్మికులకు హామీ లభించడంతో ఆందోళన తాత్కాలికంగా వాయిదా వేశారు. 26వ తేదీన కలెక్టర్ సమక్షంలో యాజమాన్యంతో చర్చలు జరుపుతామని హామీ ఇవ్వడంతో కార్మికులు ఆశతో ఉన్నారు. అయితే అకస్మాతుగా సోమవారం ఉదయం భారీగా గంగవరం పోర్టు పరిసరాల్లో మోహరించడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతోందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.