ఓ యువకుడు రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయి రెండు కాళ్లు పోగొట్టుకున్న ఘటన రాజమండ్రి రైల్వేస్టేషన్ లో జరిగింది. ఖమ్మంకు చెందిన డి. నరేష్(26)కు విశాఖలోని ఓ కాలేజీలో ఎంబీఏ సీటు రావడంతో ఆదివారం కోణార్క్ ఎక్స్ ప్రెస్ ఎక్కాడు. జనరల్ బోగీలో రాజమండ్రి వరకు వచ్చి, అక్కడ ఏసీ బోగీలో సీటు కోసం యత్నించాడు. సీటు దొరకకపోవడంతో తిరిగి జనరల్ బోగీ ఎక్కుతుండగా రైలు కదిలింది. దీంతో నరేశ్ రైలుకు, ప్లాట్ ఫామ్ కు మధ్య పడిపోవడంతో రెండు కాళ్లు పూర్తిగా తెగిపోయాయి.