ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి శాసనసభ్యునిగా గెలిచి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానుల నడుమ అట్టహాసంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం బ్రహ్మణపల్లిలోని మేకపాటి నివాసంలో నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ ఇన్ చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డిలచే నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలసి భారీ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు.