నారా చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలతోనే నిండిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి పార్టీని, కుర్చీని లాక్కున్న దుర్మార్గుడని మండిపడ్డారు. అనంతపురంలో ఎమ్మెల్సీ పోతుల సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు అనేక ఆరోపణలు చేసి ఆయన్ను ఇబ్బందిపెట్టాలని చూశాడన్నారు. చంద్రబాబు గోబెల్స్ ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్నాడని, అబద్ధాలు ప్రచారం చేసి వైయస్ జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టాలని కుట్రలు చేస్తున్నాడన్నారు.