ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగలేదు... బిజెపి నేత భాను ప్రకాష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 26, 2023, 06:40 PM

శ్రీవాణి ట్రస్టులో వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలపై బీజేపీ నేత భాను ప్రకాష్ స్పందించారు. టీటీడీకి చెందిన శ్రీవాణి ట్రస్టులో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ట్రస్టుపై అవగాహన లేకే కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారని, పింక్ డైమండ్, నేలమాళిగలు అంటూ అనవసర రాద్ధాంతం చేశారని అన్నారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలేనని అప్పుడు కూడా ఖండించానని చెప్పారు.


భక్తుల్లో నెలకొన్న అనుమానాలను తీర్చాల్సిన బాధ్యత టీటీడీపై ఉందని అన్నారు. శ్రీవాణి ట్రస్టుకు ఎన్ని విరాళాలు వస్తున్నాయో ప్రతి నెలా 1వ తేదీన టీటీడీ ప్రకటించాలని కోరారు. పింక్ డైమండ్ పై పరువునష్టం దావా కేసులో రూ. 2 కోట్ల భక్తుల డబ్బును కోర్టుకు చెల్లించారని... ఆ సొమ్మును టీటీడీ పాలకమండలి, అధికారులు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com