జీవీఎంసీ 91వ వార్డు పరిధిలో ఉన్న 480, 481, 482 సచివాలయలలో పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం జీవీఎంసీ కో - ఆప్షన్ మెంబర్ బెహర భాస్కరరావు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష పథకం జనాల్లోకి ఏ విధంగా తీసుకువెళ్లాలి ప్రజలతో ఎలా మాట్లాడాలి అనే విషయంపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బెహరా భాస్కరరావు మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. అలాంటి గొప్ప ముఖ్యమంత్రి మన జగనన్న మరొక 30 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండాలని మనందరం కలిసికట్టుగా పని చేసి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు.
వాలంటీర్స్, కన్వీనర్లు గృహసారథులు అందరు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి మీ క్లస్టర్ పరిధిలో ఉన్న ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు ఉన్న తక్షణమే మీరు ఆ పని పూర్తి చేయలని సూచించారు. ఈ కార్యక్రమంలో 91వ వార్డు అధ్యక్షులు గునిశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు జి. అప్పలస్వామి నాయుడు, క్లస్టర్ కన్వీనర్ గేదెల మురళీకృష్ణ, ఊటపల్లి గోవిందు, బండారు శ్రీనివాసరావు, బురెడ్డి గోపి సచివాలయల కన్వీనర్లు, ఆర్పీలు, సచివాలయం సిబ్బంది, వాలంటరీలు, గృహసారథులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.