భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్. ఎఫ్. ఐ) విశాఖ జిల్లా కమిటీ అధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్థి స్థాయిలో ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుధ్ధంగా పుస్తకాల వ్యాపారం చేస్తున్న ప్రైవేటు, కార్పోరేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాని. జిల్లా కలెక్టరెేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి ఎల్. జె. నాయుడు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై 20 రోజులు గడిచిందని, స్కూల్స్ ప్రారంభంలోనే అనేక సమస్యలతో విద్యార్థులకు స్వాగతం పలుకుతున్నాయన్నారు.
సమస్యలు మెరుగుపర్చకుండానే నెట్టికొచ్చే పద్దతి జిల్లా అధికారులు వ్యవహారిస్తున్నారని. మంచి నీరు మరియు టాయిలేట్ల సమస్యలు అధికంగా ఉన్నాయని. నాసి రకమైన బ్యాగులతో విద్యా కానుక కిట్లు అరకోరగా అందించి ఈ ప్రభుత్వం ఆర్భాటం చేస్తోందన్నారు. ప్రభుత్వం నేటికి విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య పుస్తకాలు అందించలేదని. గతంలో ప్రభుత్వమే జూనియర్ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందించేది, నేడు వైసిపి ప్రభుత్వ వైఖరి వలన జిలాల్లో వేలాది మంది పేద విద్యార్థులపై పుస్తకాల భారం పడనుందన్నారు.
అలాగే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో కార్పోరేట్ మరియు ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా యూనిఫాం, షూలు, పుస్తకాల విక్రయాలు జరుపుతు పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నాయన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్, ఎఫ్. ఐ) విశాఖ జిల్లా కమిటీగా జిల్లా కలెక్టర్ కార్యలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం స్పందనలో జాయింట్ కలెక్టర్‌కి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్. ఎఫ్. ఐ జిల్లా అధ్యక్షులు ఎం. డి శివ, జిల్లా ఉపాధ్యక్షులు జి. పల్లవి, ఏ. యు కార్యదర్శి పి. సూర్య, మరియు ఎం. శసి, తులసీరాం, ఆజయ్, సాయితేజ పాల్గొన్నారు.