విశాఖ ఎయిర్‌పోర్టులో ఢిల్లీ నుంచి పోర్టు బ్లెయిర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎమర్జెన్సీగా ఆదివారం రాత్రి విశాఖ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేశారు. విమానంలో ప్రయాణికులకు ఆదివారం రాత్రి ఒక హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. దీంతో పోర్టు బ్లెయిర్ వెళ్లాల్సిన ప్రయాణికులు 270 మంది ప్రయాణికులు విశాఖపట్నంలోనే ఉండిపోయారు.
ఈ విమానంలో ప్రయాణిస్తున్న వారిలోఎక్కువ మంది మెడికల్ కౌన్సిలింగ్‌కి వెళ్లాల్సిన వాళ్లే ఉన్నారు. ఇన్ని గంటలు గడిచినా ఎప్పుడు వెళ్తాము అని కచ్చితమైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. అలాగే మెడికల్ కౌన్సిలింగ్‌కు వెళ్లాల్సినవారు కూడా కంగారుపడుతున్నారు. ఈ విమానంలో ప్రయాణికుల్ని విశాఖపట్నం మేఘాలయ హోటల్లో ఉన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అని చెప్పారని.. తమను తిరిగి పోర్ట్ బ్లెయిర్ ఎప్పుడుతీసుకెళతారో ఇంకా క్లారిటీ లేదని చెబుతున్నారు.
ఆదివారం ఉదయం 05:30 గంటలకు ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలు దేరినట్లు ప్రయాణికురాలు చెబుతున్నారు. ఆ తర్వాత రెండుసార్లు అండమాన్‌లో పైలెట్ ఫ్లైట్ ల్యాండ్ చెయ్యడానికి ప్రయత్నించారని.. కానీ లాభం లేకుండా పోయింది అన్నారు.
పైలెట్ కి తగిన నైపుణ్యం లేక పోవడంతో లాండ్ చెయ్యలేక పోయారని.. అండమాన్ రన్ వే చిన్నగా ఉంటుంది.. అందుకే నైపుణ్యం కలిగిన పైలెట్ లేక పోవడంతో సేఫ్ ల్యాండ్ చెయ్యలేక పోయారని చెప్పుకొచ్చారు. త లగేజ్‌కి సరైన భద్రత కూడా కల్పించలేక పోయారని.. ఎయిర్ ఇండియా పై తగిన చర్యలు తీసుకోవాలి అన్నారు. ఈ విమానానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.