గుంటూరు జిల్లాలో తాడేపల్లి పరిధిలో సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో కృష్ణా నది ఒడ్డున రాతితో చేసిన నాగదేవత విగ్రహాలు కనిపించాయి.. దాదాపు 50 ప్రతిమలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు గుర్తుతెలియని వ్యక్తులు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ కుప్పగా పోశారు. అంతేకాదు ఆ విగ్రహాలన్నీ దెబ్బతిని ఉన్నాయి. ఆలయాల్లో దేవతామూర్తుల విగ్రహాలు తొలగిస్తే నదిలో కలిపే సంప్రదాయం ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ విగ్రహాలను నది ఒడ్డున వదిలివెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు.
అంతకాదు గతంలో కూడా పశ్చిమ డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు నాగదేవత ప్రతిమలను వదిలివెళ్లారు. దానికి కూడా ఇదే కారణం అయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విగ్రహాలు ఎక్కడివి, ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పోశారనే చర్చ జరుగుతోంది. కృష్ణా నదిలో మరికొన్ని విగ్రహాలు ఉన్నాయనే ప్రచారం నడుస్తోంది. స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు.. ఇలాంటి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెడితే దోషాలు చుట్టు కుంటాయని.. అందుకే ఇలా నదిలో విగ్రహలు వదలి వెళ్లారనే వాదన ఉంది.