ఈజిప్ట్ మరియు అమెరికా పర్యటనలు ముగించుకుని ఢిల్లీకి తిరిగి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ పూరితో సహా క్యాబినెట్ అగ్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పట్టణ వ్యవహారాలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ హాజరయ్యారు.ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాతోపాటు సీనియర్ అధికారులు కూడా పాల్గొన్నారు.అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనల నుంచి మోదీ సోమవారం తెల్లవారుజామున చేరుకున్నారు.